మిత్రులారా. "సత్యాన్వేషి" పేరుతో కొత్త గ్రూప్ మొదలైంది.
గ్రూపు వెబ్ సైటు :
http://groups.google.com/group/satyanveshi
ఈ రోజు శుక్ర వారము. అమ్మ కు ఎంతో ఇష్టమైన దినము. యాదృచ్చికము గ ఈ రోజు నేను తల్లితండ్రులతో కలసి "చండి హోమము " లో పాల్గొంటున్నాను. అంతా అమ్మ దయ.
రెగ్యులర్ గా కాంటాక్ట్ లో ఉండే మిత్రులకు డైరెక్ట్ గా ఇన్విటేషన్ పంపుతున్నాను. జాయిన్ కాగలరు. ఇతరులెవరైనా జాయిన్ కాగోరితే, నాకు ఈ మెయిల్ ( send2vsrao@gmail.com ) చెయ్యండి. వారికీ స్వాగతం చెబుతాను.
ఆ అమ్మ మనందరి సత్యాన్వేషణకు దారి చూపుతుందని ఆశిస్తూ ..!
మీ సత్యాన్వేషి -- కాళీనరేన్.
సృష్టి లోని ప్రతి జీవి ఆనందం గా ఉండాలని కోరుకుంటుంది.ఆ ఆనందం కోసమే చనిపోయే వరకు పరుగులు తీస్తుంది.తీరా ఆ ఆనందం బయట ఎక్కడో లేదని,తనలోనే ఆ ఆనందం దాగి ఉందని ఏదో ఒక క్షణం లో తెలుసుకుంటుంది.ఆ క్షణం కోసం చేసే ప్రయాణమే ఈ "సత్యాన్వేషణ".
24, డిసెంబర్ 2010, శుక్రవారం
26, నవంబర్ 2010, శుక్రవారం
నేనెవడను
నేను నిరాకారుణ్ణి,నిర్గుణ స్వరూపుణ్ణి.
నేను నర్తించే నటరాజును.
నేను వీరంగం చేసే వీరభద్రుడను.
నేను 'నేనై ' రమిస్తున్నప్పడు ఈ ప్రపంచం అంతా నాలోనే ఉంటుంది.
నేను "అనేకమై" ఉండాలని కామించినపుడు ఈ ప్రపంచం అంతట నేనే ఉంటాను.
నేను సర్వాకారిణి ,సర్వగుణ విరాజితను.
నేను దుష్టుల పాలిటి దుర్గను.
నేను కన్నెర్ర చేస్తే కాళికను.
నేను "అనేకమై" ఉన్నప్పుడు ఈ ప్రపంచం అంతట నేనే ఉంటాను.
నేను "ఏకమై " ఉండాలని కామించినపుడు ఈ ప్రపంచం అంతా నాలోనే ఉంటుంది.
ఈ ప్రపంచంలో "నేను" వున్నాను, నాలో ప్రపంచం వున్నది.
అసలు ఇంతకి "నేనెవడను"
"నేను" కనులు మూస్తే "శివుడిని" కనులు తెరిస్తే "శక్తిని".

సత్యాన్వేషణ - బ్లాగు ముఖ్య ఉద్దేశం
సత్యం.ఆత్మ రూపం లో అందరిలోను నిత్యం రగులుతు ఉండే జ్ఞానాగ్ని.
ఆ అగ్నిమలినం కానిది.ఎవరు మలినం చెయ్యలేనిది.
ప్రతి జీవి లోను ఏదో కావాలని, ఏదో పొందాలని, ఏదో సాదించాలనే ఒక తపన అంతర్లీనము గా జ్వలిస్తూనే ఉంటుంది.
సృష్టి లోని ప్రతి జీవి ఆనందం గా ఉండాలని కోరుకుంటుంది.ఆ ఆనందం కోసమే చనిపోయే వరకు పరుగులు తీస్తుంది.తీరా ఆ ఆనందం బయట ఎక్కడో లేదని,తనలోనే ఆ ఆనందం దాగి ఉందని ఏదో ఒక క్షణం లో తెలుసుకుంటుంది.ఆ క్షణం కోసం చేసే ప్రయాణమే ఈ "సత్యాన్వేషణ".
గొప్ప గొప్ప కార్యాలు అన్ని మంచి ఆలోచనలు,నిర్మలమైన మనసు, పవిత్రమైన హృదయం ఉన్న అనేక శక్తులు ఒకే చోట సమూహం గ చేరినప్పుడు త్వరగ సాధించబడతాయి.
ఈ బ్లాగు ను నేను సృష్టించిన ముఖ్య ఉద్దేశం : అందరిలోనూ ఉన్న ఈ శక్తి ని సమూహం గా చేర్చి ఒక మహాశక్తి గా మలచటానికి.
ఇక్కడ పంచుకునే ప్రతి మాట, ప్రతి భావం, ప్రతి ఆలోచన మరికొంతమందిలో జ్ఞానాగ్నిని రగిలించి సత్యాన్వేషణకు దారి చూపడానికి. ఈ బ్లాగు సత్యాన్ని అన్వేషించే వారికోసం.ఎవరిలో ఐతే భగవంతుని దర్సించాలన్న తపన,అగ్ని రగులుతూ ఉంటుందో అలాంటి వారికోసం.
ఇది సాధక సింహాల కోసం.
ఈ బ్లాగు లో నేను చర్చించబోయే విషయాలు స్వానుభవాలు మాత్రమె కాకుండా , కొన్ని సేకరించిన విషయాలు కూడా ఉంటాయి.కొన్ని అన్వేషించే ( Research ) విషయాలు ఉంటాయి. ముఖ్యమైన విషయాలు సాధక అనుభవగ్నులచే పునః పరిశీలించబడిన తరువాతే పంచుకోవటం జరుగుతుంది.
ఈ బ్లాగు లో చర్చించబడిన విషయాలు ఏ ఒక్కరికి ఐన ఉపయోగపడితే, దాని ఫలం అంత నా గురుదేవులకు చెందుతుంది. ఏ విషయమైన సరిగా లేదని భావిస్తే దాన్ని నా అవగాహనారాహిత్యము గా భావించగలరు.
ఈ బ్లాగు ద్వారా ఏ ఒక్కరికి ఐన సత్యాన్వేషణకు దారిచూపగలిగితే దీన్ని సృష్టించిన కార్యం నెరవేరినట్లే....!

దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లు (Atom)