సృష్టి లోని ప్రతి జీవి ఆనందం గా ఉండాలని కోరుకుంటుంది.ఆ ఆనందం కోసమే చనిపోయే వరకు పరుగులు తీస్తుంది.తీరా ఆ ఆనందం బయట ఎక్కడో లేదని,తనలోనే ఆ ఆనందం దాగి ఉందని ఏదో ఒక క్షణం లో తెలుసుకుంటుంది.ఆ క్షణం కోసం చేసే ప్రయాణమే ఈ "సత్యాన్వేషణ".
అడిగిన వాడికి అంతే వచ్చును
అడగని వాడికి అంతా ఇచ్చును
నీది కానిదే నువ్వు వెతుకును
అంతా నీదైతే వెతుకుట కేమి మిగులును?
వినరా ఓ నరుడా ఈ నరేంద్రుని మాట!