26, నవంబర్ 2010, శుక్రవారం

నేనెవడను

నేను  నిరాకారుణ్ణి,నిర్గుణ స్వరూపుణ్ణి.
నేను  నర్తించే  నటరాజును.
నేను  వీరంగం  చేసే వీరభద్రుడను.
నేను  'నేనై ' రమిస్తున్నప్పడు  ఈ ప్రపంచం  అంతా నాలోనే  ఉంటుంది.
నేను "అనేకమై" ఉండాలని కామించినపుడు ఈ ప్రపంచం  అంతట  నేనే  ఉంటాను.

నేను సర్వాకారిణి ,సర్వగుణ విరాజితను.
నేను  దుష్టుల పాలిటి  దుర్గను.
నేను  కన్నెర్ర  చేస్తే  కాళికను.
నేను "అనేకమై" ఉన్నప్పుడు  ఈ ప్రపంచం  అంతట  నేనే  ఉంటాను.
 నేను "ఏకమై " ఉండాలని కామించినపుడు ఈ ప్రపంచం  అంతా నాలోనే  ఉంటుంది.

ఈ ప్రపంచంలో "నేను" వున్నాను, నాలో ప్రపంచం వున్నది.

అసలు  ఇంతకి  "నేనెవడను"

"నేను"  కనులు  మూస్తే  "శివుడిని"  కనులు  తెరిస్తే  "శక్తిని".

2 కామెంట్‌లు:

  1. కాళీ నరేన్ గారు

    కవిత బాగుంది. బ్లాగ్ చిత్రం బాగుంది.

    శ్రీవాసుకి

    రిప్లయితొలగించండి
  2. బాగుంది మీబ్లాగు. ఇలాగే మంచి టపాలు అందిస్తారని ఆశిస్తున్నాను.

    రిప్లయితొలగించండి