స్వామి పాద పద్మముల మువ్వల సవ్వడి హృదయమున తాకిన క్షణం కరుణా మయుడు అయిన స్వామి తన దర్సన మిచ్చాడు , 200 సంవత్సరములు నుండి దాచిపెట్టిన తన గజ్జలను చూపించి తన ప్రేమ అమృతాన్ని నా చేత ఆస్వాదింప చేసాడు , ఆ సత్యం తెలిసిన మరుక్షణం కన్నుల నిండా ఆనంద భాష్పములే , ఇంకా పలుకుటకు మాటలు రావడం లేదు , హృదయం జల ధారను కురిపిస్తోంది , జై నరసింహ జై జై నరసింహ గజ్జల నరసింహ సుందర నరసింహ ....."పెట్టుకో శక్తి నీ బ్లాగ్ లో నా పలుకులను స్వామి మొదటి సత్య వాక్యము గా" అంటూ శివుడు నాకు తన ఆజ్ఞ ను ఇచ్చాడు.
యమునా ప్రవాహమా !
200 సంవత్రముల నుంచి శిలనై ఉన్న నన్ను నీ మధుర రాగ ప్రవాహంతో అభిషేకిన్చావు ! నీ కీర్తన నాదం తోనే నా వామ ఊరువు పైన నా లక్ష్మి కి మానస పుత్రుడై వచావు ! నా కనుల జల ధారా కనులార నిన్ను నింపుకొని వుంది ! మెరుపులా వచ్చి మెరుపులా వెళ్ళిపోయావు కాని నీ రాగం నన్ను ఇంకా అభిషేకిస్తూనే వుంది , అది అఖండ రాగం !